కీర్తి.. కొత్త ప్రయాణం
చెన్నై: కమర్షియల్ చిత్రాల్లో అందంగా కనిపిస్తూనే కథా బలం ఉన్న సినిమాల్లో డీ గ్లామర్‌గా కనిపించేందుకు సిద్ధంగా ఉంటారు నాయిక కీర్తి సురేశ్. ఇప్పటికే పలు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించిన ఆమె మరో సినిమాతో వస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. సంబంధిత ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు కీర్తి సురేశ్. ‘మేము మరో ప్రయాణం మొదలుపెట్టాం. మీ ఆశీస్సులు కావాలి’ అని ట్వీట్ చేశారామె. ఈ సినిమాలో కీర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తుందని సమాచారం. స్ర్కీన్ సీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: యామిని, కూర్పు: నగూర, కళ: రాము తంగరాజ్.
గతేడాది విడుదలైన కీర్తి, రాఘవన్ల ఫస్ట్‌లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మహేశ్ బాబు కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నారు కీర్తి. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందా చిత్రం.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్