ఎన్నో త్యాగాలు చేశా: కంగనా రనౌత్
నేను నో చెప్పిన వాటితో ఓవర్‌నైట్ స్టార్స్
ముంబయి: ఒకానొక సమయంలో తాను ఎన్నో త్యాగాలు చేశానని బాలీవుడ్ నటి, క్వీన్ కంగనా రనౌత్ అన్నారు. కెరీర్ ప్రారంభంలో పలువురు హీరోల సరసన నటించిన కంగన ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనని ఐటమ్ సాంగ్ డ్యాన్సర్‌గా పోలుస్తూ ఇటీవల మధ్యప్రదేశ్ మాజీ మంత్రి సుఖ్‌దేవ్ పన్సే చేసిన వ్యాఖ్యలపై కంగన ఘాటుగానే సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. తాను దీపిక, ఆలియా, కత్రినా లాంటి హీరోయిన్ను కాదని ఆమె సమాధానమిచ్చారు.
కాగా, కంగన చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటి స్వరాభాస్కర్ కామెంట్ చేశారు. ‘రజ్జో’లో (కంగన కథానాయిక) కంగన చేసిన స్పెషల్ సాంగ్ వీడియోని పోస్ట్ చేస్తూ.. ‘ఇది నాకు ఎంతో ఇష్టమైన ఐటమ్ సాంగ్. (కంగన ఐటమ్ సాంగ్స్ చేసి కూడా చేయలేదని చెప్పుకుంటున్నారు.)’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. స్వరాభాస్కర్ చేసిన వ్యాఖ్యలపై కంగన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అది ఐటమ్ సాంగ్ కాదని.. కథతోపాటే సాగే ఓ పాట మాత్రమేనని అన్నారు. ‘నేను ఎప్పుడైతే ‘ఏ’ లిస్ట్‌లో ఉన్న నటీనటులపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తానో వెంటనే ‘బీ’ లిస్ట్‌లోని తారలు సైనికుల్లా మారి నాపై పోరాటం చేయడానికి సిద్ధమవుతారు. కథతో సంబంధం లేకుండా సినిమా మధ్యలో వచ్చే పాటలను ఐటమ్ సాంగ్స్ అంటారు. అలాంటి పాటల్లో మహిళలను కించపరిచేలా పదాలు ఉంటాయి. ఈ విషయం బీ గ్రేడ్ వాళ్లకు అర్థం కాకపోవచ్చు కానీ నేను మాత్రం సంజయ్‌లీలా భన్సాలీ, ఫర్హాన్‌ఖాన్ సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్ అవకాశాలొస్తే తిరస్కరించాను. నేను తిరస్కరించిన వాటితో కొంతమంది నటీమణులు ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యారు. ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఇప్పుడు ఉన్న ఈ స్థాయికి చేరుకోగలిగాను.’ అని నటి కంగన అన్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?