హైదరాబాద్: సాయితేజ్ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు దేవా కట్టా తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రిపబ్లిక్ షూట్ పూర్తయింది. 64 రోజుల్లో ఎలాంటి కొవిడ్ కేసులు లేకుండా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తం చిత్ర బృందానికి ఈ క్రెడిట్ దక్కుతుంది. థ్యాంక్యూ’ అని ట్వీట్ చేశారు.
దీనిపై చిత్ర కథానాయకుడు సాయితేజ్ కూడా స్పందించారు. ‘రిపబ్లిక్ షూట్ పూర్తయింది. కెమెరా వెనుక, ముందూ ఉన్న వారి కృషి వల్లే ఇంత త్వరగా షూటింగ్ పూర్తయింది. చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ చూస్తే, విభిన్న కథాంశంతో పొలిటికల్ థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!