Bollywood News: హిందీ ‘మాస్టర్‌’ సల్మాన్‌? - salman khan acquires remake rights of telugu film khiladi and master
close
Published : 12/06/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood News: హిందీ ‘మాస్టర్‌’ సల్మాన్‌?

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ ఓ తమిళ చిత్రం హిందీ రీమేక్‌లో నటింబోతున్నాడు అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. విజయ్‌ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మాస్టర్‌’. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకారణ పొందింది. ఈ చిత్రాన్ని ఎండెమోల్‌ షైన్‌ ఇండియా, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్, నిర్మాత మురాద్‌ ఖేతానీ కలిసి హిందీలో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ నటింబోతున్నట్లు సమాచారం. సల్మాన్‌ ‘మాస్టర్‌’ చిత్రాన్ని చూసి రీమేక్‌లో నటించడానికి అంగీకారం కూడా తెలిపారట. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా వ్యవహారాలు కొన్ని రోజులుగా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది? దర్శకుడు ఎవరు? లాంటి విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ‘రాధే’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్‌ ప్రస్తుతం ‘అంతిమ్‌’, ‘టైగర్‌ 3’, ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’, ‘కిక్‌2’ చిత్రాల్లో నటిస్తున్నాడు. జులైలో ‘మాస్టర్‌’ రీమేక్‌తో పాటు మరో భారీ చిత్రానికి  సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రవితేజ ‘ఖిలాడీ’ హక్కులు: రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఈ సినిమా టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ‘క్రాక్‌’ విజయం తర్వాత రవితేజ నుంచి రానున్న చిత్రమిది. ఈ సినిమా హిందీ హక్కుల్ని సల్మాన్‌ఖాన్‌ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని