ఆసక్తికరంగా సంపూర్ణేష్‌ ‘క్యాలీఫ్లవర్‌’ లుక్‌ - sampoornesh babu cauliflower first released
close
Published : 10/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసక్తికరంగా సంపూర్ణేష్‌ ‘క్యాలీఫ్లవర్‌’ లుక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, ఆర్కే మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ వంటి హాస్యరస చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్‌బాబు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సంపూ నటిస్తున్న ‘క్యాలీఫ్లవర్‌’ ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. మే 9న సంపూర్ణేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఈ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. ఫస్ట్‌లుక్‌లో సంపూర్ణేశ్‌బాబు ఆంగ్లేయుడిగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. టైటిల్‌తో పాటు ట్యాగ్‌లైన్ ‘శీలో రక్షతి రక్షితః’  కూడా కొత్తగా ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రాన్ని గూడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిణి, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని