ఇంటర్నెట్ డెస్క్: విక్టరీ వెంకటేశ్ కెరీర్లో హిట్ సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు చర్చకు క్యూకడతాయి. అందులో ఆడుతుందో లేదోనన్న అనుమానాలతో మొదలై అదిరిపోయే హిట్టు కొట్టిన సినిమాలూ ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ‘శత్రువు’ అగ్రస్థానంలో ఉంటుంది. ఈతరం వాళ్లకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ముప్పయ్యేళ్ల క్రితం నాటి సినీ ప్రేక్షకులకు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన విజయశాంతి ఆడిపాడింది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజుకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం. వేటూరి, సీతారామశాస్త్రి రాసిన పాటలు.. రాజ్-కోటి వినసొంపైన సంగీతం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటితో 30 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం..
సినిమా కథేంటంటే..
నిజాయతీగా ఉండే న్యాయవాది దుర్గాప్రసాద్ (విజయ్‌కుమార్) రౌడీల చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దుర్గాప్రసాద్ దగ్గర అశోక్ (వెంకటేశ్) న్యాయవాదిగా పనిచేస్తుంటాడు. తనను చేరదీసి ప్రయోజకుడిగా తయారు చేసిన న్యాయవాదిని దారుణంగా హతమార్చిన వాళ్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు అశోక్. శత్రువును దెబ్బతీస్తూ వెళుతుంటాడు. ఈ క్రమంలో చట్టాన్ని విశ్వసించే ఏసీపీ విజయ (విజయశాంతి) కథానాయకుడికి అడ్డుపడుతూ ఉంటుంది. మొత్తానికి హీరో.. విలన్ వెంకటర్నతం (కోట శ్రీనివాసరావు)పై విజయం సాధిస్తాడు. ఆఖరికి చట్టం ముందు లొంగిపోతాడు. ఇదే సినిమా కథ. డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ప్రతినాయకుడిగా కోట శ్రీనివాసరావు సినిమాను తారస్థాయికి తీసుకెళ్లారు. బ్రహ్మానందం, నగేశ్ తనదైన కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు.
అలా బీజం
నిర్మాత ఎం.ఎస్.రాజు తండ్రి రాయపరాజు కూడా పలు సినిమాలను నిర్మించారు. తండ్రిలాగే తాను కూడా నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎం.ఎస్.రాజు ఆలోచిస్తుండేవారు. అప్పటి నుంచి విపరీతంగా సినిమాలు చూడటం మొదలుపెట్టారు. సినిమాలపై మంచి పరిజ్ఞానం వచ్చిన తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణను కలిసి సినిమా చేయాలన్న ఆలోచనను వ్యక్తపరిచారు. అలా ‘శత్రువు’ సినిమాకు బీజం పడింది. అప్పటి వరకూ కేవలం హాలీవుడ్‌కే పరిమితమైన స్క్రీన్‌ప్లే అనే పదం ఈ సినిమాతోనే తెలుగు సినిమాకు దగ్గరైంది. వీటికి తోడు ‘బొబ్బిలి రాజా’ వెంకటేశ్, ‘కర్తవ్యం’తో విజయశాంతి భారీ విజయాలు అందుకొని అప్పటికే తెలుగు సినిమా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇంకేముంది సినిమా విడుదలవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. సినిమా భారీ విజయం సాధించింది. 150 రోజుల పాటు థియేటర్లలో అలరించిన ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్లో ఓ కీలక మైలురాయిగా నిలిచింది.
ఇదీ చదవండి..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ