భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్‌? - shah rukh khan and sanjay leela bhansali reinitiate talks for izhaar
close
Published : 09/05/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌లో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీది ప్రత్యేక స్థానం. ఆయన తనదైన శైలితో చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. మరొకరు బాలీవుడ్ బాద్‌షా కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవదాస్‌’. 20 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేయలేదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో ‘ఇజార్‌’ అనే ప్రేమకథా చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ కథను నాలుగేళ్ల కిందటే షారుఖ్‌తో కలిసి చేయాలనుకున్నాడట సంజయ్‌. చిత్ర కథంతా ఓ ప్రేమజంట చుట్టూ తిరగనుంది.  ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైక్లింగ్ చేసిన వ్యక్తి నిజ జీవిత ఆధారంగానే భన్సాలీ ఈ కథను తయారు చేసుకొన్నాడని సమాచారం. ఇందులో షారుఖ్‌ ప్రేమ కోసం నార్వే వరకు సైక్లింగ్ చేసే పాత్రలో కనిపించనున్నారట. సంజయ్‌ స్ర్కిప్టుపై నిరంతరం కృషిచేస్తున్నారట. అయితే షారుఖ్ దీనిపై ఎలా స్పందిస్తాడో. గ్రీన్ సిగ్నల్‌ ఇస్తాడా లేదో తెలియాలి. ప్రస్తుతం సంజయ్‌ - సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హీరా మండి’ అనే వెబ్‌ సీరీస్‌ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్‌ సైతం తన ‘పఠాన్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని