‘సత్యమేవ జయతే’ పూర్తి - shooting of john abraham starrer wraps up postproduction in progress
close
Published : 21/06/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సత్యమేవ జయతే’ పూర్తి

ముంబయి: జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 2’. కరోనా పరిస్థితులతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగానే ఆగిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత అనుమతులు రావడంతో ఇటీవలే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు అంటూ మే 13న విడుదల కావాల్సిన ఈ సినిమాని చిత్రబృందం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దివ్యా కోస్లా కుమార్‌ నాయికగా నటిస్తోంది. మిలాప్‌ జవేరీ తెరకెక్కించిన ఈ చిత్రంలో మనోజ్‌ బాజ్‌పాయ్, అమైరా దస్తుర్‌ తదితరులు నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని