close
Published : 26/02/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’

హైదరాబాద్‌: ‘పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ పెళ్లి ముందే జరిగి పోతే నీకీ పెళ్లి ఎందుకు ఇష్టం ఉంటుంది’ అంటూ స్నేహితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటుడు సత్య. సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా, రాజీవ్‌ కనకాల, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్‌ జెల్లి దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని