SonuSood: ఆ కారు నేను కొనలేదు - sonu sood denies gifting rs 3 crore luxury car to son ishaan
close
Published : 21/06/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SonuSood: ఆ కారు నేను కొనలేదు

వరుస కథనాలపై స్పందించిన నటుడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌.. తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని తాజాగా ఆ కారుని ఇంటికి కూడా తీసుకువచ్చారంటూ పలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే సదరు వార్తలపై సోనూసూద్‌ స్పందించారు. ఆ కారుని తాను కొనుగోలు చేయలేదని తెలిపారు.

‘ఇషాన్‌కి కారు కొనుగోలు చేసినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ కారుని బహుమతిగా కూడా ఇవ్వలేదు. ట్రయల్స్‌ కోసం మాత్రమే దానిని ఇంటికి తీసుకువచ్చాం. నా భార్య, పిల్లల్తో కలిసి టెస్ట్‌ రన్‌కు వెళ్లాను. అంతేకానీ మేము దానిని కొనుగోలు చేయలేదు. ‘ఫాదర్స్‌ డే’ రోజున నేనేందుకు నా కుమారుడికి గిఫ్ట్‌ ఇస్తాను. పిల్లలు, ఫ్యామిలీతో నేను సమయం గడిపితే చాలు.. అదే వాళ్లకు ఇవ్వగలిగే పెద్ద బహుమతి. ఎందుకంటే వాళ్లతో సమయం గడపడానికి వీలు దొరకడం లేదు’ అని సోనూ వివరించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్‌. ప్రస్తుతం ఆయన ఓ వైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు. తెలుగులో ‘ఆచార్య’, బాలీవుడ్‌లో ‘పృథ్వీరాజ్‌’ సినిమాలతోపాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని