మహేశ్‌, ప్రభాస్‌ చూడ్డానికే అలా ఉంటారు: సుబ్బరాజు - subbaraju about mahesh and prabhas
close
Published : 18/06/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌, ప్రభాస్‌ చూడ్డానికే అలా ఉంటారు: సుబ్బరాజు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఎన్ని సినిమాల్లో చూసినా సినిమా హీరోల అసలు వ్యక్తిత్వం ఏంటో మనకు తెలిసే అవకాశం చాలా తక్కువే. వాళ్లు ఒక్కో సినిమాలో ఒక్కోరకమైన పాత్ర పోషిస్తుంటారు. వాళ్ల అసలైన వ్యక్తిత్వం వాళ్లను ఎంతో దగ్గరగా చూసినవాళ్లకే తెలుస్తుంది. కవర్‌ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దనే సామెత కూడా ఉంది కదా! అయితే.. మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌ తెరవెనుక ఎలా ఉంటారనే విషయాన్ని ప్రముఖ నటుడు సుబ్బరాజు వెల్లడించారు. ఆయన మహేశ్‌బాబుతో పాటు ప్రభాస్‌తోనూ పలు సినిమాల్లో నటించారు. కాగా.. ఇటీవల ఓ క్లబ్‌హౌస్‌ సెషన్‌లో భాగంగా సుబ్బరాజు పలు విషయాలు పంచుకున్నారు.

‘‘మహేశ్‌బాబు చూడటానికి చాలా సున్నితంగా కనిపిస్తారు. కానీ.. ఆయన చాలా కచ్చితత్వం ఉన్న మనిషి. ప్రతి విషయంలోనూ ఆయన స్పష్టతను కోరుకుంటారు. ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలంటారు. ఇక ప్రభాస్‌ గురించి చెప్పాలంటే ఆయన చూడటానికి కఠినంగా కనిపించినా.. ఆయన చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. చాలా మంచి మనిషి. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం సరదాగా అనిపిస్తుంది’’ అని సుబ్బరాజు అన్నారు. సుబ్బరాజు మహేశ్‌బాబుతో కలిసి పోకిరి, దూకుడు, శ్రీమంతుడుతో పాటు పలు చిత్రాల్లో నటించారు. మరోవైపు ప్రభాస్‌ కెరీర్‌లో మంచి హిట్‌ చిత్రాలుగా నిలిచిన మిర్చి, బాహుబలి చిత్రాల్లో సుబ్బరాజు కనిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని