‘వాల్తేర్‌ వాసు’ ఏం చేస్తున్నాడు? - sumanth film anaganaga oka rowdy completed shooting
close
Published : 01/05/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వాల్తేర్‌ వాసు’ ఏం చేస్తున్నాడు?

ఇంటర్నెట్‌ డెస్క్: హీరో సుమంత్‌ ‘కపటధారి’ తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. మను యజ్ఞ దర్శత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రొస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటున్నట్లు సుమంత్ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సుమంత్ ఈ చిత్రంలో వాల్తేరు వాసుగా నటిస్తున్నారు. ఆయన ఆహార్యం కొత్తగా కనిపిస్తోంది. చిత్ర కథ అంతా విశాఖపట్నం నేపథ్యంగా తెరకెక్కుతోంది. సినిమాకి మార్క్.కె రాబిన్ సంగీతం స్వరాలు సమకూరుస్తుండగా పవన్‌ కుమార్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఇందులో రఘు కారుమంచి, ధన్‌రాజ్‌, మిర్చి కిరణ్‌, మనోజ్‌ నందం, కల్యాణ్‌ విట్టపు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వినీత్ భట్, గార్లపాటి రమేష్ నిర్మాతలు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని