rajinikanth: సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రజనీ - superstar rajinikanth gets his vaccination
close
Published : 13/05/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

rajinikanth: సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రజనీ

చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. చెన్నైలోని ఆయన నివాసంలో వైద్యుల బృందం కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ ఇచ్చింది. రజనీ వెంట ఆయన కుమార్తె సౌందర్య ఉన్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా రజనీ కోరారు.

ఇక రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘అణ్ణాత్తే’ చిత్ర షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది. శివ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ నెల రోజులు పాటు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. అనంతరం రజనీ చెన్నై బయలు దేరి వెళ్లారు. ఓ వారం విశ్రాంతి తీసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారట రజనీ. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని