Suriya 40: కొత్త క‌బురు వినిపించారు  - surya new film update
close
Published : 08/06/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suriya 40: కొత్త క‌బురు వినిపించారు 

చెన్నై: సూర్య కథానాయకుడుగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభ‌మైన ఈ సినిమా అప్‌డేట్‌ని అభిమానుల‌తో పంచుకుంది చిత్ర బృందం. ఇప్ప‌టి వ‌రకు 35 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

జులైలో టైటిల్‌ని ప్ర‌క‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌థానాయ‌కుడిగా సూర్య‌కి ఇది 40వ చిత్రం. ‘సూర్య 40’ వ‌ర్కింగ్ టైటితో షూటింగ్ జ‌రుపుకుంటోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. గతంలో పాండిరాజ్‌-సూర్య కాంబినేషన్‌లో ‘పసంగ 2’ చిత్రం రూపొందింది. తెలుగులో ‘మేము’ పేరుతో విడుదలై మంచి విజ‌యం అందుకోవ‌డంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని