close
Published : 28/03/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అదిరింది’లో ఈ సీన్‌ నిజంగా అదిరింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘మెర్సెల్‌’. తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదలైంది. 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విజయ్‌ ఇందులో త్రిపాత్రాభినయంతో మెప్పించారు. కాజల్‌, నిత్యామేనన్‌, సమంతలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఎస్‌.జే.సూర్య ప్రతినాయకుడిగా కనిపించారు.

ఇందులో డాక్టర్‌ పాత్ర పోషించిన విజయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మహిళ ప్రాణాలు కాపాడే సీన్ అలరిస్తుంది. విమానాశ్రయంలో పోలీసులతో ఫైట్‌ చేసి మరీ మహిళను రక్షిస్తాడు. తాజాగా నెట్‌ఫ్లిక్‌ ఆ వీడియోను యూట్యూబ్‌లో పంచుకుంది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని