ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుల సినిమా ప్రకటించడమే ఆలస్యం అంచనాలు భారీగా పెరుగుతుంటాయి. పాటలు ఎలా ఉంటాయి? కథేంటి? కథానాయిక ఎవరు? అంటూ అన్వేషిస్తుంటారు సినీ అభిమానులు. కొత్త అప్డేట్ కావాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయా చిత్రాలకు పనిచేస్తున్న సాంకేతిక బృందాన్ని అడుగుతుంటారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న తమన్‌కి ఇదే పరిస్థితి ఎదురైంది. మహేశ్ బాబు కథానాయకుడుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. కీర్తి సురేశ్ నాయిక. తమన్‌ని ఈ సినిమా గురించి ఏమైనా సమాచారం ఇవ్వమని ఓ అభిమాని ట్వీట్ చేశారు. ‘సర్కారు వారి పాట సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. గతంలో వచ్చిన ఆల్బమ్స్‌కి మించి ఉండబోతుంది. అది మాత్రం ఫిక్స్. ఆగస్టులో కలుద్దాం’ అని సమాధానం ఇచ్చారు తమన్. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి సంబంధించి తొలిపాట ఆగస్టులో విడుదలకావచ్చు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగే కథ అని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. 2021 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!