‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ లిఫ్ట్‌లో ఏం జరిగింది? - thank you brother​ trailer anasuya viraj ashwin premieres may 7 in aha
close
Published : 01/05/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ లిఫ్ట్‌లో ఏం జరిగింది?

ఇంటర్నెట్‌ డెస్క్: అనసూయ భరద్వాజ్‌, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. రమేశ్‌ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా ‘ఆహా’లో మే 7 నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని ‘ఆహా’ విడుదల చేసింది. ‘‘అయినా లిఫ్ట్‌లో వాటర్‌ తాగడం ఏంటీ? కామన్‌ సెన్స్ ఉండక్కర్లేదా..’’ అని అనసూయను విసుక్కుంటాడు విరాజ్‌ అశ్విన్‌. అంతలోనే ఉన్నట్టుండి లిఫ్ట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత లిప్ట్‌లో ఏం జరిగింది? గర్భంతో ఉన్న అనసూయకు ఏమైందనేది తెలియాలంటే ట్రైలర్‌ పూర్తిగా చూడాల్సిందే. మౌనికారెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘ఆహా’ సమర్పణలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి కలిసి చిత్రాన్ని నిర్మించారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించగా సురేష్‌ రగుతు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. కరోనా వైరస్ లేకుంటే సినిమా ఈ పాటికే థియేటర్లలో విడుదల అయ్యేది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని