close
Published : 06/03/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్లని పట్టించుకోను: తమన్‌

హైదరాబాద్‌: ఇటు తెలుగుతోపాటు అటు తమిళం, కన్నడ చిత్రాలకూ సంగీతం అందిస్తూ.. వరుస ప్రాజెక్ట్‌లతో సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ‘వకీల్‌సాబ్‌’, ‘సర్కారువారి పాట’ వంటి భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కాగా, ‘వకీల్‌సాబ్‌’ నుంచి తాజాగా విడుదలైన ‘సత్యమేవ జయతే’ ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమన్‌ ట్విటర్‌ వేదికగా కొంత సమయంపాటు అభిమానులతో ముచ్చటించారు. #ASKThaman పేరుతో నెటిజన్లతో చాట్‌ చేశారు. అందులో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన తెలియజేశారు.

‘‘సర్కారువారి పాట’ నుంచి తప్పకుండా మీకెన్నో సర్‌ప్రైజ్‌లు వస్తాయి. ఇటీవలే ఆ సినిమా షూట్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి, సర్‌ప్రైజ్‌లు కోసం కొంత సమయం వేచి ఉండండి. ఆగస్టులో తప్పకుండా మనం కలుసుకుందాం.(సాంగ్స్‌ రిలీజ్‌)’’ అని తమన్‌ పేర్కొన్నారు. అనంతరం, ఓ నెటిజన్‌.. ‘కొంతమంది వ్యక్తులు సోషల్‌మీడియా వేదికగా మీ గురించి ట్రోల్స్‌ చేస్తుంటారు. వాటిని మీరెలా స్వీకరిస్తున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘నా మ్యూజిక్‌ గురించి వచ్చే ట్రోల్స్‌ని నేను పట్టించుకోను. నాపై ట్రోల్స్‌ క్రియేట్‌ చేయడం కోసం వాళ్లు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.’ అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా తన దృష్టిలో పవన్‌ ఒక లీడర్‌ అని తెలిపారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘చిట్టి నీ నవ్వంటే’ పాట తనకు బాగా నచ్చిందని ఆయన వివరించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని