ఆ సమయంలో చనిపోయానేమో అనుకున్నా!
ఇంటర్నెట్ డెస్క్: జేమ్స్ కామెరూన్ దర్శక-నిర్మాణంలో తెరకెక్కతున్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘అవతార్ 2’. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను నీటిలోనే చిత్రీకరించారు. ఇందులో ‘టైటానిక్’ కథానాయిక కాటె విన్స్లెట్ ‘రోనల్’ అనే పాత్రలో నటిస్తోంది. కథలో ఆమెది చాలా కీలకమైన పాత్ర. ఈ సినిమా కోసం ఆమె డైవింగ్ నేర్చుకుందట. కాటెపై ఏడు నిమిషాల పాటు అండర్ వాటర్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె భర్త నెడ్ రాక్ర్నోల్ చాలా సహాయపడ్డారట. తాజాగా ఆమె ‘అవతార్2’ చిత్రంలోని అండర్ వాటర్‌లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ...‘‘నీటి అడుగు భాగాన చిత్రీకరణ జరుపుతున్న సమయంలో నా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. ఓ దశలో నేను చనిపోయానేమో అనుకున్నా. నీటిలో ఉండి ఊపిరి బిగబట్టే విషయంలో మా ఆయన నెడ్ నాకెంతో సహాయపడ్డారు’’ అంటూ తెలిపింది. లైట్స్ట్ర్రోమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జియోవన్నీ రిబిసి తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 16, 2022న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి:
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?