నాని.. రితూ.. ఓ రానా చిత్రం! - truth or dare with nani ritu varma rana daggubati
close
Published : 09/06/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని.. రితూ.. ఓ రానా చిత్రం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ఎంత చెత్తగా ఉన్నా తాను మాత్రం మధ్యలో లేచి వెళ్లడం ఉండదని కథానాయకుడు నాని అన్నాడు. మధ్యలో లేచి వెళ్లాలనిపించిన సినిమా ఏది? అని రానా అడిగిన ప్రశ్నకు నాని ఇలా సమాధానం ఇచ్చాడు. ఒక ఛారిటీ ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌వాక్‌ చేస్తుండగా అదుపుతప్పి పడిపోయానని, అందరి ముందు జరిగిన ఆ సంఘటన ఎప్పటికీ మరిచిపోలేనని హీరోయిన్‌ రితూవర్మ చెప్పింది. నాని, రితూ జంటగా ‘టక్‌ జగదీశ్‌’ చిత్రంలో నటించారు. కాగా.. రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘నంబర్‌ వన్‌ యారి’ కార్యక్రమంలో ఈ ఇద్దరూ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరితో రానా ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ గేమ్‌ ఆడించారు. ఈ నేపథ్యంలో ఒకసారి డేర్‌ ఎంచుకున్న రితూ రానా చిత్రాన్ని గీసింది. ఆ తర్వాత నాని కూడా రానా చిత్రాన్ని గీశాడు. అయితే.. నాని ‘మిక్కీ మౌస్‌’ చిత్రం వేసి.. నాకు తెలిసిన రానా ఇలాగే అల్లరి చేస్తాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రానా అడిగిన పలు ప్రశ్నలకు నాని, రితూవర్మ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. అలా వాళ్ల మధ్య జరిగిన సంభాషణ సరదాగా సాగింది. ఈ పూర్తి కార్యక్రమం ‘ఆహా’లో ప్రసారం అవుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని