వరుణ్‌తేజ్‌ ‘గని’ కూడా వాయిదా పడనుందా? - varun tej movie gan release date postpone
close
Published : 15/05/2021 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌తేజ్‌ ‘గని’ కూడా వాయిదా పడనుందా?

ఇంటర్నెట్‌ డెస్క్: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో కథానాయికగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనైసెన్స్‌ పిక్చర్స్‌, అల్లు బాబీ కంపెనీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా కరోనా రెండో దశ నేపథ్యంలో చిత్రం అనుకున్న తేదీకి విడుదలయ్యే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దర్శకుడు కిరణ్‌ మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు.

ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో వరుణ్‌ కొత్తగా కనిపిస్తున్నారు. 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న ఇంగ్లాడ్‌కి చెందిన మాజీ బాక్సర్ టోనీ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్‌లో వరుణ్‌ శిక్షణ తీసుకున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర, నదియా తదితరులు నటిస్తున్నారు. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా జార్జ్ సి. విలియమ్స్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేశ్‌ ఎడిటర్‌. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మాతలు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని