close
Published : 28/03/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వెంకటేష్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: ఆయన తెరకెక్కించే సినిమాలన్నీ చాలా సాప్ట్‌గా ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకొనేలా చేస్తాయి. అలాంటి దృశ్యాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే శేఖర్‌ కమ్ముల - వెంకీకి  కథను వినిపించారట. కథ నచ్చిన వెంకీ సానుకూలత వ్యక్తం చేశారట. దాంతో శేఖర్‌ ‘లవ్‌స్టోరీ’ చిత్రం పూర్తికాగానే వెంకీ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు మొదలుపెట్టే యోచన చేస్తున్నారట. ఈ మధ్యే ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాటకి మంచి స్పందనే లభించింది. ప్రస్తుతం వెంకటేష్‌  - అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’ చిత్రం చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. మరో వైపు ‘నారప్ప’ మే 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని