close
Published : 19/02/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయ్ చిత్రంలో విద్యుత్ జమ్వాల్?

ఇంటర్నెట్ డెస్క్: తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘దళపతి 65’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త ధ్రువీకరించలేదు.  సన్ పిక్చర్స్ పతాకంపై  నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. విద్యుత్ జమ్వాల్ గతంలో విజయ్‌తో కలిసి ‘తుపాకి’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. తాజా చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇక కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని