close
Published : 26/02/2021 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 విజయ్‌ సేతుపతి - కత్రీనాల చిత్రం పేరు అదేనా?

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాది నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా కత్రీనా కైఫ్‌ నాయికగా ఓ సినిమా చేస్తున్నారు. ‘అంధాదున్‌’ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా రూపొందనున్న చిత్రానికి ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌  పూణెలో ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అంతేకాదు అంతా సక్రమంగా జరిగితే చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో థియేట్రికల్ రిలీజ్ కోసం నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు  సమాచారం. ఇదిలా ఉండగానే విజయ్‌ ‘గాంధీ టాక్స్’ అనే బాలీవుడ్‌ మూకీ చిత్రంలో నటించనున్నారు. కిషోర్‌ పాండురంగ్‌ బెలేకర్‌ దర్శక-నిర్మాణంలో రూపొందనున్న చిత్రానికి దివై ధమిజైన్‌ సహ నిర్మాత. విజయ్‌ సేతుపతి ఈ మధ్యే విడుదలైన ‘ఉప్పెన’ చిత్రంలో ప్రతినాయకుడు శేషారాయనం పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. త‌న కులం కానివాడు త‌న కూతురిని ప్రేమించాడ‌న్న కోపంతో హీరోను (వైష్ణవ్‌) శేషారాయ‌నం ఏం చేశాడన్నది చిత్ర కథ. ఇంకా హిందీలో సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముంబైకర్‌’ అనే చిత్రంలో నటిస్తోన్నారు. తమిళంలో ‘తుగ్లక్‌ దర్బార్‌’లోనూ నటిస్తున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని