close
Published : 15/04/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విక్రాంత్‌ రోణ’ విడుదల తేదీ ఖరారైంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు సుదీప్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ మోషన్‌ పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు సుదీప్‌. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. ఈ సినిమా 3డీ వెర్షన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మొన్నటి వరకు షూటింగ్‌ సంబరం.. ఇప్పుడు రిలీజ్‌ మరో కొత్త ఉత్సాహం. ఈ ఆగస్టు 19న విక్రాంత్‌ రోణతో మీ ముందుకు వస్తున్నాం’ అని తెలుగులో ట్వీట్‌ చేసి ఆకట్టుకుంటున్నారు సుదీప్‌.

ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీత అశోక్‌, మధు సూదన్‌ రావు, రవిశంకర్‌ గౌడ, సందేశ్‌ జైన్‌, కార్తీక్‌ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలినీ మంజునాథ్‌ నిర్మిస్తున్నారు. అంజీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. నటుడిగా సుదీప్‌ ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బూర్జ్‌ ఖలీఫా (దుబాయ్‌) భవనంపై ఈ చిత్ర టైటిల్‌ లోగోను, టీజర్‌ను లేజర్‌ షోతో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.


1382570216492716033

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని