close
Published : 28/03/2021 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హిట్‌-2’ చేయలేకపోవడానికి కారణమదే!

హైదరాబాద్‌: ‘ఈ నగరానికేమైంది’ చిత్రంతో నటుడిగా మంచి సక్సెస్‌ సాధించారు విశ్వక్‌సేన్‌. ఆ తర్వాత తనే డైరెక్టర్‌గా మారి ప్రధానపాత్రలో నటించిన ‘ఫలక్‌నుమాదాస్’తో మాస్‌ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ‘హిట్‌’చిత్రంలో యాంగ్రీ పోలీస్‌ పాత్రలో నటించి ప్రస్తుతం ‘పాగల్‌’అంటూ  యూత్‌ఫుల్‌ కథతో మన ముందుకు రాబోతున్నారు. మరి చిత్రం విశేషాలేంటో ఆయన మాటల్లోనే వినేద్దామా!

*లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందే ‘పాగల్‌’ ప్రారంభ పూజా కార్యక్రమం జరిగింది. మళ్లీ సంవత్సరం తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ముహూర్తపు షాట్‌కు రానా క్లాప్‌ కొట్టారు. మళ్లీ ఆయన చిత్రంతో పాటుగానే నా సినిమా రావడం కొత్తగా అనిపిస్తోంది.

* ‘హిట్’కంటే ముందు విన్న కథ ఇది. సాధారణంగా నేను కథలు వినడానికి వెళ్లే ముందు ఆ స్టోరీ నాకు నచ్చదనే అభిప్రాయానికి వచ్చేస్తా. కానీ, డైరెక్టర్‌ నరేశ్‌ చెప్పిన కథ, అది వివరించిన విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. ఆ తర్వాత ఈ కథ డెవలెప్‌ చేసేందుకు టైమ్‌ పట్టనుండడంతో ‘హిట్‌’లో నటించా.

* ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో కాకుండా కేవలం థియేటర్లలోనే ప్రదర్శించాలని అనుకున్నాం. ఇదివరకు రోజుల్లో అలాగే ఉండేది. మళ్లీ ఈ సినిమాతో తిరిగి ఆ ట్రెండ్‌ మొదలవుతుందని మా నిర్మాత దిల్‌రాజుగారు అంటున్నారు.

* ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం రెండు రాష్ట్రాల్లో ‘పాగల్‌’ రథయాత్ర చేయబోతున్నాం. 1600 రోజాపూలు మా అభిమానులకు పంచడం ఇందులో ఒక ప్రత్యేకత. ఈ ఏడాది మూడు సినిమాల్లో కనిపించాలనుకుంటున్నా. ‘ప్రాజెక్టు గామీ’ అనే చిత్రం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. అలాగే పీవీపీ సంస్థలో, బీవీఎన్‌ ప్రసాద్‌ గారి నిర్మాణంలో తదుపరి సినిమాలున్నాయి.

* నా మొదటి సినిమా నుంచి ఒకదానికొకటి సంబంధంలేని సినిమాలే చేస్తున్నా. బేసిగ్గా ‘పాగల్‌’ నేనుకుంటున్నారు. కానీ, సినిమా చూశాక ఎవరు గురించి ‘పాగల్‌’అనే టైటిల్‌ పెట్టామో అర్థమౌతుంది. ఈ చిత్రంలో నా లుక్‌ బాగా రావడానికి మా స్టైలిస్ట్‌ బాగా కష్టపడ్డారు.

* నేను డైరెక్టర్‌ మణిరత్నంగారికి వీరాభిమానిని. మా ‘పాగల్‌’ చూశాక మీకు పూరి, సుకుమార్‌, మణిరత్నంల మాదిరి టేకింగ్‌, విజువల్స్‌ కనిపిస్తాయి. మా డైరెక్టర్‌ నరేశ్‌ బేసిగ్గా రైటర్‌ కావడంతో డైలాగ్స్‌ బాగా రాసుకున్నారు. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. ఈ కథను రెగ్యులర్‌ పంథాలో కాకుండా విభిన్నంగా తెరకెక్కించాం.

* ప్రస్తుతం పరిశ్రమలో పోటీతత్వం చాలా ఉంది. ఆ పోటీలో నేను నిలవాలంటే కచ్చితంగా ప్రేక్షకులకు విభిన్నంగా కనిపించాలి. అందుకే స్క్రిప్టు విషయంలో అస్సలు రాజీపడను. మంచి కథ అనుకుంటే ఆ రైటర్లు, డైరెక్టర్లకు నిర్మాతను నేనే పరిచయం చేస్తా.

*‘హిట్‌2’కు డేట్స్‌ సర్దుబాటు కాలేదు. అదే కొంచెం బాధగా ఉంది. కానీ, ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. సంతోషంగా ఉంది. ‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌కు కూడా ప్లాన్‌ చేస్తున్నా.

*నాకు బ్రేక్‌ ఇచ్చిన డైరెక్టర్‌ తరుణ్‌భాస్కర్‌తో నాది అవినాభావ సంబంధం. ఆయన ఇచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడతాయి. చిత్ర పరిశ్రమలో నేను సుదీర్ఘ ప్రయాణం కోరుకుంటున్నా. ఆ దిశగానే శ్రమిస్తున్నా.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని