close
Published : 17/02/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రవితేజ సరసన కథానాయిక ఎవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘క్రాక్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు రవితేజ. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ఇందులో నాయికలుగా డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే నక్కిన త్రినాథరావు చెప్పిన కథ నచ్చడంతో రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో ఇద్దరు కథానాయికలు నటించనున్నారట. ఓ పాత్ర కోసం రాశీఖన్నాని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో ‘టచ్‌ చేసి చూడు’, ‘బెంగాల్‌ టైగర్’ చిత్రాల్లో వీరి జోడీ సందడి చేసింది. ఇప్పుడు ముచ్చటగా ఇది మూడో చిత్రం అవుతోంది. నక్కిన ‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని