నటిపై వార్తలు.. స్పందించిన దర్శకుడు
ముంబయి: ఓ సినిమా విషయంలో ప్రముఖ నటి టబుని నిందిస్తూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్ చిత్ర దర్శకుడు అనీస్ బాజ్మీ స్పందించారు. అసలు టబుని ఎందుకు నిందిస్తున్నారో అర్థం కావడం ఆయన అన్నారు. టబు, కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భూల్ భులయ్యా-2’. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ గతేడాది ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. అనంతరం అక్టోబర్‌లో తిరిగి ప్రారంభం కావాల్సిన షూట్ కాస్త జనవరికి మరోసారి వాయిదా వేశారు. దీంతో, సినిమాలో ఎంతో కీలకమైన టబు షూట్‌కు వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడమే ‘భూల్ భులయ్యా-2’ ఆలస్యానికి కారణమంటూ ఎన్నో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదంటూ అందరూ చెప్పుకున్నారు.
తమ సినిమా గురించి ఎంతో కాలం నుంచి వస్తోన్న వార్తలపై తాజాగా దర్శకుడు స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. ‘మా సినిమా తిరిగి పట్టాలెక్కకపోవడానికి టబుని ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా షూట్ కోసం ఆమె ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఆమె షూట్‌కు రానని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే, పది నెలల నుంచి నేనే ముంబయిలో లేను. కరోనా పరిస్థితుల రీత్యా కుటుంబంతో కలిసి మా ఫామ్‌హౌస్‌కు వెళ్లాను. కథలు రాసుకుంటూ అక్కడే సమయాన్ని గడిపాను. ఇటీవలే ముంబయికి చేరుకుని చిత్రబృందాన్ని, నటీనటుల్ని కలిశాను. షూట్ ప్రారంభిస్తే వెంటనే సెట్లోకి వచ్చేస్తామని వాళ్లందరూ నాతో చెప్పారు. ఈ నెల చివరి వారంలో తప్పకుండా మా చిత్రాన్ని పట్టాలెక్కిస్తాము’ అని ఆయన వివరించారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్