‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా? - will chiru acharya come then august
close
Published : 27/04/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా?

ఇంటెర్నెట్‌ డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్‌, ఓ పాట కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకున్నాయి. చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చిత్రంలో సోనూ సూద్‌, అజయ్‌, తనికెళ్ల భరణి, కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని