అందుకే యోగాపై అవగాహన ఉండాలనేది..! - yogaday ravi teja shruti haasan gopichand malineni krack
close
Published : 22/06/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే యోగాపై అవగాహన ఉండాలనేది..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యోగా అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన ప్రక్రియ. ఇష్టం వచ్చినట్లు ఆసనాలు వేస్తే కండరాలు పట్టేయడం ఖాయం. హీరో రవితేజకు అదే జరిగింది. కంగారు పడకండి. రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ‘క్రాక్‌’ సినిమాలో జరిగిందీ సంఘటన. ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కించారు. సినిమాలో.. హీరో తన స్నేహితులతో కలిసి యోగా తరగతులకు వెళతాడు. యోగాపై అవగాహన లేకుండానే ఏదోఒకటి వేద్దాం.. అనుకొని ఒక ఆసనం వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంకేముంది.. కండరాలు పట్టేస్తాయి. హీరో నొప్పితో విలవిల్లాడుతున్నా పక్కనే ఉన్న వాళ్లంతా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. వాళ్లకు కూడా యోగాపై అవగాహన ఉండదు. ఇంతలోనే హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ వచ్చి రవితేజకు నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ క్రాక్‌ సినిమాలోని ఒక కామెడీ సన్నివేశాన్ని యూట్యూబ్‌లో పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని