‘లాల్‌ సలామ్‌’ బిగ్గరగా నవ్విస్తుందా..? - lol salam web series trailer launched by natural star nani
close
Updated : 13/06/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లాల్‌ సలామ్‌’ బిగ్గరగా నవ్విస్తుందా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొత్త దర్శకులు వాటితోనే ముందుకొస్తున్నారు. అలా విభిన్నమైన కథాంశంతో నాని బండిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘లాల్‌ సలామ్‌’. ఆరు ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్‌ ఓటీటీ వేదిక ‘జీ5’లో జూన్‌ 25 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు నాని విడుదల చేశారు. ‘మనం ఒక ప్లాన్‌ వేస్తే.. దేవుడు ఇంకో ప్లాన్‌ వేస్తాడు’, ‘మనం ఆపాల్సింది మందిని కాదు.. మంటను’ అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఒత్తిడి తట్టుకోలేక విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఓ కుర్రాడు అనుకోకుండా ఓ ల్యాండ్‌మైన్‌ మీద కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది..? వాళ్లు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే పూర్తికథ. ఈ వెబ్‌సీరిస్‌కు అజయ్‌ అరసాడ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రాకేశ్‌ ఎస్‌.నారాయణ; ఎడిటర్‌: వెంకటకృష్ణ చిక్కాల; కథ-మాటలు: అర్జున్‌-కార్తీక్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని