పెద్ద గ్యాపే ఇది..! - long gap in tollywood stars career
close
Updated : 12/03/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెద్ద గ్యాపే ఇది..!

స్టార్‌ హీరోల సినిమాలకు లాంగ్‌బ్రేక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ హీరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. హీరోలు కూడా తమ అభిమానులను అలరించేందుకు వరుసబెట్టి సినిమాలకు సంతకాలు చేసేస్తుంటారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే.. ఈసారి ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలే లేకుండా పోయాయి. టాలీవుడ్‌లో కొంతమంది స్టార్‌ హీరోలు తెరపై కనిపించి ఏడాది దాటింది. తమ అభిమాన హీరోలను తెరపై చూసి తరించేందుకు సినిమా ప్రేమికులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరోల గత సినిమా ఎప్పుడొచ్చింది.. తర్వాత సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఈ మధ్య గ్యాప్‌ ఎంత వచ్చిందనేది ఓసారి చూద్దామా..!

పవన్‌ కల్యాణ్‌

* గత సినిమా - అజ్ఞాతవాసి - విడుదల తేదీ: జనవరి.10.2018

* రాబోయే సినిమా - వకీల్‌ సాబ్‌ - విడుదల తేదీ: ఏప్రిల్‌.09.2021

* విరామం-  దాదాపు 3 సంవత్సరాలు

 

ఎన్టీఆర్‌

* గత సినిమా - అరవింద సమేత - విడుదల తేదీ: అక్టోబర్‌.11.2018

* రాబోయే సినిమా - ఆర్‌ఆర్‌ఆర్ - విడుదల తేదీ: అక్టోబర్‌‌.13.2021

* విరామం - 3 సంవత్సరాలు

రామ్‌ చరణ్‌

* గత సినిమా - వినయ విధేయ రామ - విడుదల తేదీ: జనవరి.11.2019

* రాబోయే సినిమా - ఆర్‌ఆర్‌ఆర్ - విడుదల తేదీ: అక్టోబర్‌‌.13.2021

* విరామం - రెండున్నర ఏళ్లకు పైగా..

మహేశ్‌బాబు

* గత సినిమా - సరిలేరు నీకెవ్వరు - విడుదల తేదీ: జనవరి.11.2020

* రాబోయే సినిమా - సర్కారువారి పాట  - విడుదల తేదీ: సంక్రాంతి.2022

* విరామం - 2 సంవత్సరాలు

ప్రభాస్‌ 

* గత సినిమా - సాహో - విడుదల తేదీ: ఆగస్టు.30.2019

* రాబోయే సినిమా - రాధేశ్యామ్‌ - విడుదల తేదీ: జులై.30.2021

* విరామం - సుమారు ఒకటిన్నర ఏడాది

చిరంజీవి

* గత సినిమా - సైరా నర్సింహారెడ్డి - విడుదల తేదీ: అక్టోబర్‌.02.2019

* రాబోయే సినిమా - ఆచార్య - విడుదల తేదీ: మే‌.13.2021

* విరామం - దాదాపు ఏడాదిన్నర

నాగార్జున

* గత సినిమా - మన్మథుడు2 - విడుదల తేదీ: ఆగస్టు‌‌.09.2019

* రాబోయే సినిమా - వైల్డ్‌ డాగ్‌ - విడుదల తేదీ: ఏప్రిల్‌.02.2021

* విరామం - సుమారు ఏడాదిన్నర

 

వెంకటేశ్‌

* గత సినిమా - వెంకీమామ - విడుదల తేదీ: డిసెంబర్‌‌.13.2019

* రాబోయే సినిమా - నారప్ప- విడుదల తేదీ: మే‌.14.2021

* సుమారు: ఏడాదిన్నర

బాలకృష్ణ

* గత సినిమా - రూలర్‌ - విడుదల తేదీ: డిసెంబర్‌.20.2019

* రాబోయే సినిమా - బిబి3 - విడుదల తేదీ: మే‌‌.28.2021

* విరామం - దాదాపు ఏడాదిన్నర

అల్లు అర్జున్‌

* గత ఆఖరి సినిమా - అల వైకుంఠపురములో - విడుదల తేదీ: జనవరి‌.12.2020

* రాబోయే సినిమా - పుష్ప - విడుదల తేదీ: ఆగస్టు‌.13.2021

* విరామం - ఏడాదిన్నరకు పైగా..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని