అనన్య కోసం పూరీతో రాయబారం..? - makers of chatrapthi remake have approached puri to convince ananyapanday
close
Published : 21/02/2021 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనన్య కోసం పూరీతో రాయబారం..?

‘ఛత్రపతి’ రీమేక్‌.. చిత్రబృందం ఇబ్బందిపడుతోందా..?

ముంబయి: కుటుంబకథా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లో సైతం తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించనున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆయన అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కనున్న ఈ రీమేక్‌కు సంబంధించి ఓ విషయంలో చిత్రబృందం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ విషయమేమిటంటే.. కథానాయిక ఎంపిక.

భారీ ప్రాజెక్ట్‌గా ఎన్నో అంచనాల నడుమ రానున్న ‘ఛత్రపతి’ రీమేక్‌లో శ్రీనివాస్‌ సరసన కథానాయికగా ఎవరు నటించనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం రీమేక్‌లో నటించడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఈ రీమేక్‌లో నటించే అవకాశమున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌. ఆమెతో ఈ ప్రాజెక్ట్ ఆఫర్‌ గురించి చెప్పమని చిత్రబృందం ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సంప్రదించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌‌‌’లో ప్రస్తుతం అనన్య నటిస్తున్నారు. ఆ చొరవతోనే ఆమెకు ‘ఛత్రపతి’ రీమేక్‌ గురించి చెప్పమని చిత్రబృందం పూరీని కోరినట్లు వినికిడి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని