Drushyam 2: వెంకటేశ్‌ ‘దృశ్యం2’ విడుదలపై స్పష్టత వచ్చినట్టేనా? - makers want to relase drushyam 2 on ott
close
Published : 28/09/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Drushyam 2: వెంకటేశ్‌ ‘దృశ్యం2’ విడుదలపై స్పష్టత వచ్చినట్టేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేష్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దృశ్యం2’. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం2’కు రీమేక్‌గా ఇది రాబోతోంది. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. మీనా, నదియా, నరేష్‌, కృతిక, ఈస్తర్‌ అనిల్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఎక్కడ విడుదల చేయాలన్న దానిపై చిత్ర బృందం తర్జనభర్జనలు పడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా కేసులు తగ్గడం, వరుస సినిమాలు విడుదలవుతుండటంతో ఓటీటీలో విడుదలకు చిత్ర బృందం వెనుకడుగు వేసింది. దసరాకు థియేటర్‌లో విడుదల చేయాలని భావించింది. కానీ, దసరా బరిలో పలు చిత్రాలు నిలవడం, ఏపీలో పూర్తిగా థియేటర్‌లు తెరుచుకోని పరిస్థితి ఉండటంతో ఇప్పుడు మళ్లీ ఓటీటీ వెళ్లాలని మేకర్స్‌ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకుంది. ‘‘కుటుంబ భావోద్వేగాలతో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. వెంకటేష్‌ నటన మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ ఇటీవల నిర్మాతలు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని