రెండో పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్
వరుస కథనాలపై స్పందించిన హీరో
హైదరాబాద్: కథానాయకుడు మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మనోజ్‌కు కాబోయే సతీమణి మంచు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలంటూ వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. కాగా, తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై తాజాగా మనోజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని వ్యంగ్యంగా చెప్పారు. ‘పెళ్లి తేదీ, ముహూర్తం జరిగే సమయం కూడా మీరే చెప్పేయండి’ అంటూ కామెంట్ చేశారు. మనోజ్ పెట్టిన ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తల్లో నిజంలేదని అందరూ అనుకుంటున్నారు.
‘దొంగా దొంగది’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్.. ‘రాజుబాయ్’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘పోటుగాడు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డితో ఆయన ఏడడుగులు వేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో ప్రణతీ నుంచి తాను విడాకులు తీసుకున్నానని 2019లో మనోజ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
గుసగుసలు
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్