Sudheer Babu: ఉర్రూతలూగిస్తోన్న ‘మందులోడా’ సాంగ్‌ - manduloda song from sridevi soda center starring sudheer babu
close
Updated : 09/07/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sudheer Babu: ఉర్రూతలూగిస్తోన్న ‘మందులోడా’ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌ బాబు కథానాయకుడిగా కరుణ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఆనంది కథానాయిక. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి శుక్రవారం విడుదల చేశారు. ‘మందులోడా ఓరి మాయలోడా’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఉర్రూతలూగిస్తోంది. ఉత్తరాంధ్ర జానపద స్ఫూర్తితో ఈ గీతాన్ని రచించారు కాసర్ల శ్యామ్‌. మణిశర్మ బాణీలు సమకూర్చగా సాహితి, ధనుంజయ్‌ ఆలపించారు. సుధీర్‌ బాబు డ్యాన్సు ఆకట్టుకుంటోంది. యశ్వంత్‌ మాస్టర్‌ సారథ్యంలో ఈ పాటని తెరకెక్కించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్‌, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని