ఒక రాత్రి.. ఒక కాల్‌.. మారిపోయిన జీవితాలు - manoj bajpayee dial 100 official trailer
close
Published : 20/07/2021 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక రాత్రి.. ఒక కాల్‌.. మారిపోయిన జీవితాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సస్పెన్స్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ముందుకు మరో ఆసక్తికర చిత్రం రానుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, నీనా గుప్త కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘డయల్‌ 100’. రెన్సిల్‌ డిసిల్వా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

పోలీస్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ అధికారికి ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఒక మహిళ ఏడుస్తూ ‘నేను చనిపోవాలనుకుంటున్నా’ అని చెబుతుంది. అందరూ అది ఫేక్‌ కాల్‌ అనుకుంటారు. కానీ, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆ మహిళ ఫోన్‌ చేసి, ‘బిడ్డను కోల్పోవడం అంటే ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసు’ అని ఆ మహిళ సమాధానం ఇస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ పోలీస్‌ ఆఫసర్‌కూ, మహిళకూ ఉన్న సంబంధం ఏంటి? ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ‘డయల్‌ 100’. సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని