మాస్ట్రో నుంచి ప్రచార గీతం - mastro promotional song releasing tomorrow
close
Published : 11/09/2021 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్ట్రో నుంచి ప్రచార గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌ : నితిన్‌, నభా నటేష్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘మాస్ట్రో’. హిందీ సూపర్‌ హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాదున్‌’ సినిమాకిదీ తెలుగు రీమేక్‌. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ నెల 17 నుంచి సందడి చేయనున్న ఈ చిత్రానికి ‘షురూ కరో’ అనే ప్రచార గీతాన్ని రూపొందించారు.  రేపు సాయంత్రం 5 గంటలకు ఈ గీతం విడుదలవుతుందని చిత్రబృందం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలయింది. 30 సెకన్ల ఈ ప్రోమోలో హీరో నానితో పాటు నభా నటేష్‌, తమన్నాలు స్టెప్పులేశారు. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. తమన్నా ప్రతినాయకురాలిగా సరికొత్తగా కనిపించనుంది. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని