హలో పార్ట్నర్‌: మెహరీన్‌ - mehreen engagement latest pics goes viral
close
Published : 18/03/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హలో పార్ట్నర్‌: మెహరీన్‌

నటి నిశ్చితార్థ ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: వరుస దక్షిణాది చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి మెహరీన్‌. త్వరలో ఈ పంజాబీ భామ తన ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, తన నిశ్చితార్థ వేడుక ఫొటోలను తాజాగా మెహరీన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. తన కాబోయే భర్త భవ్యతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘హలో పార్ట్నర్‌’ అని ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు. ఫంక్షన్‌లో భాగంగా తన సోదరుడు గుర్ఫీత్‌ సింగ్‌ను హత్తుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎంగేజ్‌మెంట్‌కు ముందు జైపూర్‌లోని ఓ కోటలో  ఫొటో సెషన్‌ జరిగింది. వీరి ఫంక్షన్‌ ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ ఆనంద్‌ కెమెరాలో క్లిక్‌ మనిపించారు.

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మెహరీన్‌ 2016లో విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో కథానాయికగా తెరంగేట్రం చేశారు. అనంతరం ఆమె టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ క్రమంలోనే ‘హానీ ఈజ్‌ ది బెస్ట్‌‌’ అంటూ ‘ఎఫ్‌-2 ’తో అలరించిన మెహరీన్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌-3’లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని