close
Published : 16/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ నగరంలో పోలీసులను హత్య చేస్తున్నదెవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ అభిమానులను అలరిస్తున్న మలయాళ డైరెక్టర్‌ మిథున్‌ మాన్యువల్ థామస్. ఆయన దర్శకత్వంలో గతేడాది వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంజామ్ పథిరా’ థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కుంచకో బోబన్, షరాఫ్‌యుద్దీన్‌, ఉన్నిమయ, ఇంద్రాన్స్, శ్రీనాథ్ బసి, రమ్య నంబీసన్, జీను జోసెఫ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సుశీన్‌శ్యామ్‌ సంగీతం అందించారు. ఆషిక్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రం ప్రముఖ డిజిటల్‌ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఫిబ్రవరి 19 నుంచి ప్రసారం కానుంది.

కాగా.. దానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ ట్రైలర్‌లో.. రోడ్డుపై తనను పిలిచి ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఓ యాచకుడికి టీ తాగమని హీరో కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న ఆ యాచకుడు ‘ఈ రోజు రాత్రి నువ్వు హాయిగా నిద్రపో.. ఆ తర్వాత నిద్రపోయే అవకాశం నీకు ఉండదు. ఎవ్వరూ చేయలేని పని నువ్వు మాత్రమే చేయగలవు. నీకు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇందులో హీరో అన్వర్‌ హుస్సేన్‌ అనే ఓ కన్సల్టింగ్‌ క్రిమినాలజిస్టు. నగరంలో జరిగే వరుస హత్యల కేసును పోలీసులతో కలిసి అన్వర్‌ హుస్సేన్‌ ఎలా ఛేదించాడు? ఇంతకీ ఆ హత్యలు చేసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని