Most Eligible Bachelor: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో మంచి సీన్‌ కట్ చేసేశారే..! - most eligible bachelor deleted scene akhil pooja hegde
close
Published : 24/10/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో మంచి సీన్‌ కట్ చేసేశారే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. నిడివి ఎక్కుకకావడంతో చిత్ర బృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించింది. వాటిల్లోని ఓ సీన్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా విడుదల చేసింది. ‘పెళ్లి చూపులు’ నేపథ్యంలో సాగుతుందీ సన్నివేశం. ‘యు.ఎస్‌ బ్యాచ్‌ చేతులెత్తండి.. భీమవరం బ్యాచ్‌ చేతులెత్తండి’ అంటూ సుడిగాలి సుధీర్‌ ఇందులో సందడి చేశారు. మరోవైపు, పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన అమ్మాయితో అఖిల్‌ వినోదం పంచాడు. ఆ అమ్మాయి, ఆమె పనిమనిషిని ఉద్దేశించి అఖిల్‌ చెప్పిన మాటలు సరదాగా సాగాయి. ఈ సీన్‌లో అఖిల్‌ హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే ‘అరే.. మంచి సీన్‌ కట్‌ చేశారే’ అనిపించకమానదు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని