కొత్త చిత్రం ‘డర్టీ హరి’ని మించేలా: ఎంఎస్‌ రాజు - ms raju announced a film
close
Published : 09/05/2021 18:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త చిత్రం ‘డర్టీ హరి’ని మించేలా: ఎంఎస్‌ రాజు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో హిట్‌ చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్‌. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో మరో సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మే 10 తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘7 డేస్‌ 6 నైట్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్‌ రాజు తనయుడు, నటుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘ఈ సినిమా యువతతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో సాగుతుంది. గతేడాది వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘డర్టీ హరి’ని మించి ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు ఎం.ఎస్‌.రాజు. ‘ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని సమర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’ అని అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని