హైదరాబాద్: టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు 30ఏళ్ల తర్వాత ఒకే చోట కలిశారు. ఆ అరుదైన ఘటనకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికైంది. ఇంతకీ ఎవరా ముగ్గురు సోదరులు అనేగా మీ అనుమానం. 90ల్లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా గుర్తుందిగా. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్, శరత్‌కుమార్ అన్నదమ్ములుగా నటించారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు దాదాపు 30ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు.
ప్రస్తుతం ఈ ముగ్గురూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే తమతమ సినిమా చిత్రీకరణల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రీకరణలో ఉండగా.. మరళీ మోహన్, శరత్‌కుమార్ వేర్వేరు సినిమాలు చేస్తున్నారు. ఇలా అనుకోకుండా.. ఈ ముగ్గురు ఒకేచోట కలవడంతో ‘గ్యాంగ్‌లీడర్’ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముగ్గురూ కలిసి ఫొటో తీసుకుని అభిమానులతో పంచుకున్నారు. ముగ్గురం కలుసుకోగానే 1991లో ‘గ్యాంగ్‌లీడర్’లో అన్నదమ్ములుగా నటించిన విషయం గుర్తొచ్చిందని మురళీమోహన్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కోసారి అనుకోకుండా జరిగే ఇలాంటి సంఘటనలు మంచి అనుభూతిని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సినిమాలోని చిత్రాన్ని, ప్రస్తుత చిత్రాన్ని ఒక్కచోట చేర్చి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.
విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన సినిమా తెలుగు చిత్రసీమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చిరంజీవి సరసన కథానాయికగా విజయశాంతి ఆడిపాడింది. రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాత. 1991 మే 9న విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది.
ఇదీ చదవండి..
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
-
అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీ
గుసగుసలు
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!