RRR ప్రమోషన్‌ సాంగ్‌ సిద్ధమైందా..! అనిరుధ్‌పై కీరవాణి ప్రశంసలు - music director keeravani praises anirudh ravichander
close
Published : 26/07/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR ప్రమోషన్‌ సాంగ్‌ సిద్ధమైందా..! అనిరుధ్‌పై కీరవాణి ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌ సాంగ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాంగ్‌ చిత్రీకరణ కోసం వచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ తిరిగి ముంబయి బాటపట్టడం ... అదే పాటకు సంగీతం అందించిన అనిరుధ్‌పై మరో సంగీత దర్శకుడు కీరవాణి ప్రశంసలు కురిపించడం ఆ పాట పూర్తయిందని చెప్పడానికి బలం చేకూరుస్తున్నాయి. తమిళ్‌ వెర్షన్‌ ప్రమోషన్‌ సాంగ్‌ కోసం జక్కన్న టీమ్‌ ప్రత్యేకంగా అనిరుధ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే.. దాని గురించి చిత్రబృందం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా.. కీరవాణి ఆ వార్తలను నిజం చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అనిరుధ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. సమర్థత, శక్తి, ప్రతిభ, అద్భుతమైన సహచరుల బృందం, అన్నింటికంటే ప్రధానంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే అతని తత్వం, చిరునవ్వులు చిందించే ముఖం అతని బలం’’ అని కీరవాణి ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు అనిరుధ్‌ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు.

తమిళ చిత్రసీమకు చెందిన యువ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌.. ‘వై దిస్‌ కొలవెరి’ పాటతో సంచలనమే సృష్టించాడు. ‘త్రి’, ‘రఘువరన్‌ బీటెక్‌’ వంటి చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన ‘మాస్టర్‌’, ‘వేదాళం’, ‘పెట్ట’, ‘దర్బార్‌’, ‘మాస్టర్‌‘ వంటి సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళుతున్నాడు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కీరవాణి రాజమౌళితో కలిసి పనిచేయనున్నారు. గతంలో ‘బాహుబలి’ వంటి చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రమోషన్‌ ఉండబోతుందని సమాచారం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని