Anchor Pradeep: తండ్రిని తలచుకొని భావోద్వేగం - my dad is my superhero emotional post by anchor pradeep
close
Published : 23/05/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anchor Pradeep: తండ్రిని తలచుకొని భావోద్వేగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తండ్రే తన సూపర్‌ హీరో అంటూ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా కారణంగా తన తండ్రి పాండురంగ(65) మూడు వారాల కిందట తుదిశ్వాస విడిచారు. కాగా.. తన తండ్రిని జ్ఞాపకాల్లో నుంచి ప్రదీప్‌ బయటకు రాలేకపోతున్నారు. తండ్రితో తన ప్రయాణాన్ని గుర్తు  చేసుకుంటూ ప్రదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు. తన తండ్రి గొప్పతనాన్ని, వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

‘‘ఐ లవ్‌ యూ నాన్న.. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన నీకు థాంక్యూ. నాకు గౌరవ మర్యాదలతో బతకడం నేర్పినందుకు థాంక్యూ నాన్న.. నేను ఇప్పుడు చేసేదంతా మీ గొప్పతనమే.. ఇదంతా మీకే అంకితం. నా కోసం మీరు అనుక్షణం నిలబడ్డారు. నేను చెడ్డ దారి ఎంచుకుంటే మీరు నన్ను సరిదిద్దారు. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. మీ ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. మీరు నాకెప్పుడూ ప్రత్యేకమే. నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. మిమ్మల్ని ప్రేమతో గుర్తుంచుకుంటా. మీరు ఎప్పుడూ కోరుకున్నట్లే.. నేను ఇకమీదట కూడా ప్రజలకు వినోదం పంచుతూ ఉంటా(మళ్లీ మనం కలిసే వరకూ). మిస్‌ యూ నాన్న’ అని ప్రదీప్‌ పోస్టు చేశారు. ఆ పోస్టుపై యాంకర్‌ అనసూయతో పాటు పలువురు సెలెబ్రిటీలు యాంకర్‌ ప్రదీప్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని