భాజపా వాళ్లు నా నంబర్‌ లీక్‌ చేశారు: సిద్దార్థ్‌ - my phone number was leaked by members of tn bjp
close
Published : 29/04/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా వాళ్లు నా నంబర్‌ లీక్‌ చేశారు: సిద్దార్థ్‌

చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు

చెన్నై: తమిళనాడుకు చెందిన భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారని ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ ఆరోపణలు చేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ గత కొన్నిరోజులుగా కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు భాజపా కార్యకర్తలతో ఆయనకు ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది.

కాగా, తాజాగా సిద్దార్థ్‌ తన ఫోన్‌ నంబర్‌ బయటకు లీకైందని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తనని, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ పలువురు బెదిరిస్తున్నారని ఆరోపించారు.‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారు.  సుమారు 500 ఫోన్‌కాల్స్‌.. అందరూ నన్ను తిడుతున్నారు. నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్ను హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా. వాటిని పోలీసులకు అందిస్తున్నా’ అని సిద్దార్థ్‌ తెలియజేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని