Rajamouli: రాజమౌళితో మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారా? - mythri movie makers met rajamouli today
close
Published : 14/09/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajamouli: రాజమౌళితో మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారా?

హైదరాబాద్‌: ప్రస్తుతం ‘ఆర్ఆర్‌ఆర్‌’ మూవీతో బిజీగా ఉన్నారు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మరి ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్‌ ఏంటి? కథానాయకుడు ఎవరు? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలను జక్కన్న కలిశారట. వీరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ తెరకెక్కని భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్‌. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే నడిచినట్లు తెలుస్తోంది. పూర్తి కథ ఏంటి? కథానాయకుడు ఎవరు? అన్న విషయాలు తెలియరాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మహేశ్‌బాబుతో ఓ మూవీ చేస్తానని రాజమౌళి గతంలోనే ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్‌’ తర్వాత ఆ సినిమా ప్రారంభం కానుందని అందరూ భావిస్తున్నారు. అడ్వెంచర్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ చెప్పారు.  ఇప్పుడు రాజమౌళి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలను కలవడంతో ఆసక్తిని కలిగిస్తోంది. మహేశ్‌ ప్రస్తుతం ‘సర్కారు వారిపాట’ చేస్తున్నారు. ఇది అయిన వెంటనే త్రివిక్రమ్‌ క్యాంప్‌లోకి వెళ్తారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి అప్పటివరకూ రాజమౌళి వేచి చూస్తారా? లేక మరో హీరోతో కొత్త ప్రాజెక్టు నిర్మిస్తారా? తెలియాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని