నాగచైతన్య సరసన నభా నటేష్‌ - nabha natesh opposite nagachaitanya movie
close
Published : 18/03/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగచైతన్య సరసన నభా నటేష్‌

ఇంటర్నెట్‌ డెస్క్: నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. ఈ సినిమాలో కథానాయికగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ భామ నభా నటేష్‌ని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో సమంత కథానాయికగా నటించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. చిత్రంలో నాగచైతన్య ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేయనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ‘మనం’ చిత్రం తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. ఈ సినిమాకి బీవీఎస్ రవి కథను సమకూర్చగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక. చిత్రం ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. నభా నటేష్‌ ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అంధాదున్‌’ చిత్రంలో నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని