Nagarjuna: ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ! - nagarjuna learning martial arts for new movie
close
Updated : 16/06/2021 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna: ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ!

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ముస్తాబవుతోంది. నారాయణదాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్‌ మొదలవనుంది.

ఇందులో భాగంగా నాగార్జునపై కీలక యాక్షన్‌ ఘట్టాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందుకు నాగ్‌ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగా ఆయన క్రావ్‌ మాగా, సమురై స్వొర్డ్‌ అనే ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ   తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆయన ఓ మాజీ రా ఏజెంట్‌ అధికారిగా కనిపించనున్నారు. జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు   చేస్తున్నారు. ఈ సినిమాకి యాక్షన్‌: గణేష్‌ కె, ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని