హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ లాంటి విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటించనున్నారు. అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ సైతం కీలకపాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి అశ్వినిదత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడెక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నాగ్అశ్విన్ తాజాగా తమ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
‘‘నాలుగు భారీ ప్రాజెక్ట్‌లలో ప్రభాస్ నటిస్తున్నారు. ఒక నటుడిగా ఆ ప్రాజెక్ట్‌ల భారం మొత్తాన్ని ఆయన భుజాలపై మోస్తున్నారు. కానీ, ఆయనలో మాత్రం ఎలాంటి ఒత్తిడి కనిపించదు. ఇటీవల మా సినిమా అప్డేట్ ఇవ్వాలనుకున్నప్పటికీ.. ఇది సరైన సమయం కాదని అర్థమైంది. అందుకే ఆగాను. ‘రాధేశ్యామ్’ విడుదలయ్యాక లేదా జూన్, జులై నెలల్లో మా సినిమా షూట్ ప్రారంభం కాగానే అప్డేట్ తప్పక ఇస్తా. మా కథను ఎప్పుడో సిద్ధం చేసేసుకున్నాం. ప్రస్తుతం దానికి అనుగుణంగా ప్రీ ప్రొడెక్షన్ వర్క్ చేస్తున్నాం’’ అని నాగ్ అశ్విన్ వివరించారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’